ఏమీ చేయలేకే గతాన్ని తవ్వుతారు!
సోషల్‌మీడియాలో మహిళలు, సెలబ్రిటీలు లక్ష్యంగా జరుగుతున్న దుష్ప్రచారంపై కథానాయిక మృణాల్ ఠాకూర్ ఆవేదన వ్యక్తం చేసింది. మహిళల జీవన విధానం గురించి, వారి ఎంపికల గురించి తీర్పులు చెప్పే ధోరణి రోజురోజుకి పెరిగిపోతున్నదని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో తన వ్యక్తిగత అనుభవాలను కూడా ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.
‘మనల్ని విమర్శించడానికి ఏమీ దొరకనప్పుడు మన గతాన్ని వెలికితీస్తారు. చవకబారు ఆరోపణలు చేసి ఏదో సాధించామని సంబరపడిపోతారు. నా విషయంలో అదే జరిగింది. ఎవరితోనైనా ప్రేమగా మాట్లాడినా, చిరునవ్వుతో పలకరించినా లవ్‌ఎఫైర్ అంటూ ప్రచారం చేశారు. నా స్నేహితుల దగ్గరి నుంచి ప్రేమించే వ్యక్తుల వరకూ.. ప్రతి ఒక్కరిని పరిచయం చేయడానికి నేను ఇష్టపడతాను. ఎప్పటికప్పుడు నా సినిమా విశేషాలను పంచుకుంటూ సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటాను. ఇంత ఓపెన్‌గా ఉంటున్నప్పటికీ నా మీద ఎందుకు పుకార్లు వ్యాప్తి చేస్తారో అర్థం కాదు. కొన్నిసార్లు వారి వినోదం కోసం వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తుంటారు’ అని మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది. ఆమె తాజా చిత్రం ‘పూజా మేరీ జాన్’ ఇటీవలే ఓటీటీలో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

