కరెంటియ్యడం చేతగాదా?
కరెంటియ్యడం చేతగాని సర్కార్ ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు. కరెంట్ లేక.. నీరందక పంటలు ఎండిపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన చెందుతున్నారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 17: కరెంటియ్యడం చేతగాని సర్కార్ ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు. కరెంట్ లేక.. నీరందక పంటలు ఎండిపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన చెందుతున్నారు. సర్కార్ తీరును నిరసిస్తూ శనివారం కూడా పలు జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు. సబ్స్టేషన్లను ముట్టడించడంతోపాటు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు.
విద్యుత్తు కోతలను నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేటలో ఎండిన పంటలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. సబ్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. విద్యుత్తు సరఫరా తీరును ఏఈని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్తు కోతలు రైతులను కంటతడి పెట్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌లో విద్యుత్తు కోతలతో ఎండిపోయిన వరి పొలాలను అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పరిశీలించారు.
కాంగ్రెస్ అంటేనే కరెంట్ కష్టాలని, మళ్లీ పాత రోజులను తెచ్చిందని విమర్శించారు. రేవంత్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని తెలిపారు. వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలోకి వెళ్తున్నదని, ఈ విషయంలో గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. కరెంట్ కోతలను నిరసిస్తూ రైతు లు సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లి సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టగా బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. రైతులకు నాణ్యమైన విద్యుత్తు అందించాలని కోరు తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ చెకపల్లి రోడ్డులోని సబ్‌స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ.. సాక్షాత్తూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వగ్రామమైన రుద్రంగిలోనే పంటపొలాలు ఎండిపోతున్నా ఆయనకు పట్టింపు లేదని విమర్శించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని తెలంగాణ తల్లి విగ్రహం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు రైతులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు కాగడాలు, క్యాండిళ్లతో నిరసన ర్యాలీ తీశారు. రోడ్డుపై బైఠాయించి సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరెంట్ కోతలతో పంటలన్నీ ఎండిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో కాగడాలతో ర్యాలీ తీస్తున్న మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు

సిరిసిల్ల జిల్లా వేములవాడలోని చెక్కపల్లి రోడ్డులోని సబ్‌స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నాయకుడు చల్మెడ లక్ష్మీనరసింహారావు తదితరుల నిరసన
- కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు

లోవోల్టేజీ సమస్యలతో తరచూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలో మరమ్మతుల కోసం శనివారం ట్రాక్టర్లో ట్రాన్స్ఫార్మర్ను తరలిస్తున్న రైతులు
– వీపనగండ్ల
- సాగుకు నీళ్లిచ్చి ఆదుకోండి

కరీంనగర్ జిల్లా శంకరపట్నంలోని జాతీయ రహదారిపై శనివారం బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి రాస్తారోకో చేపట్టారు. కాలువల ద్వారా పొలాలకు నీరందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ధర్మారం శివారులో 50 మంది రైతులు వంద ఎకరాలు సాగు చేశారు. ఇంకొన్ని రోజుల్లో కోతలు ప్రారంభం కానుండగా, నీళ్లందక పంటలు ఎండిపోతున్నాయి. అప్పులు తెచ్చి పంటలు సాగు చేస్తే.. చేతికందకుండా పోయే దుస్థితి దాపురించిందని రైతులు నిరసన తెలిపారు.
- కాంగ్రెస్ పాలనలో అరిగోసే..

సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌లో ఎండిన వరి పంటను పరిశీలిస్తున్న అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్
- కరెంట్.. ఐదారు గంటలూ రాకపాయె!

నిరంతర విద్యుత్తు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లి సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా చేస్తున్న గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు

వరద కాలువలో నీళ్లు ఉన్నా కరెంట్ లేక పొలం ఎండిపోవడంతో జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూర్‌కు చెందిన రైతు లక్కం రాజు వినూత్న నిరసన తెలిపాడు. శనివారం పొలంలో బైక్ నడుపుతూ పంటను ధ్వంసం చేశాడు.
– మెట్పల్లి రూరల్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

