గాంధీలో అరుదైన శస్త్ర చికిత్స
శ్వాస నాళం సమస్యతో బాధపడుతున్న ఓ యువకుడికి గాంధీ దవాఖాన వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. భూపాలపల్లి జిల్లాకు చెందిన పాలిటెక్నిక్ విధ్యార్థి సందీప్ (24), శాస నాళం సమస్యతో గాంధీ దవాఖానలో చేరాడు. 2018లో అతడు పురుగుల మందు తాగినప్పటి నుంచి ఈ సమస్యతో పలు దవాఖానలకు వెళ్లి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి శస్త్ర చికిత్సలు జరిగినా..
బన్సీలాల్పేట్, అక్టోబర్ 17 : శ్వాస నాళం సమస్యతో బాధపడుతున్న ఓ యువకుడికి గాంధీ దవాఖాన వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. భూపాలపల్లి జిల్లాకు చెందిన పాలిటెక్నిక్ విధ్యార్థి సందీప్ (24), శాస నాళం సమస్యతో గాంధీ దవాఖానలో చేరాడు. 2018లో అతడు పురుగుల మందు తాగినప్పటి నుంచి ఈ సమస్యతో పలు దవాఖానలకు వెళ్లి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి శస్త్ర చికిత్సలు జరిగినా.. సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఇటీవల గాంధీ దవాఖాన వైద్యులను సంప్రదించగా, కార్డియోథొరాసిక్ విభాగం వైద్యులు అతడి ఊపిరితిత్తులను పరిశీలించారు. సీటీ సర్జన్లు డాక్టర్ రవీంద్ర, డాక్టర్ పద్మలత, డాక్టర్ రాజశేఖర్, ఈఎన్టీ సర్జన్లు డాక్టర్ నాగరాజు, డాక్టర్ రామోజీ, అనస్థీషియా నిపుణులు డాక్టర్ మురళీధర్, డాక్టర్ సుచరితల బృందం అతడికి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం సందీప్ ఆరోగ్య పరిస్థితి బాగుందని, గురక తగ్గిందని, శ్వాస తీసుకోవడంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయాయని, అతడిని డిశ్చార్జి చేశామని వారు తెలిపారు. ఈ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్యులను గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ టి.ఉషారాణి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కే.సునీల్ కుమార్లు అభినందించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

