22 వేలు దాటిన యాక్టివ్ కేసులు
హైదరాబాద్, జనవరి 17 : రాష్ట్రంలో కరోనా కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2,447 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ సంబంధ సమస్యలతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరోవైపు 2,295 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,112, మేడ్చల్ మల్కాజిగిరిలో 235, రంగారెడ్డిలో 183, సంగారెడ్డిలో 73 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 22 వేలు దాటింది. రికవరీ రేటు 96.31 శాతానికి తగ్గింది.