హైదరాబాద్, జులై 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర క్యాబినెట్ సమావేశం శుక్రవారం నిర్వహించనున్నారు. క్యాబినెట్ భేటీకి సంబంధించిన ఎజెండా ఏంటనేది బహిర్గతం చేయలేదు. కనీసం మంత్రులకు కూడా ఎజెండా ఏంటనే విషయం తెలియదని సమాచారం. పలు ప్రాజెక్టులకు సంబంధించి క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. ఎల్నినో ప్రభావంతో సాగు, తాగు నీళ్లకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదమున్నది. ఈ పరిస్థితుల నుంచి గట్టేక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై క్యాబినెట్లో చర్చించే అవకాశమున్నది. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపైనా క్యాబినెట్లో చర్చించి అవకాశమున్నది.