డ్రోన్లతో పంటలు.. AIతో దిగుబడి!
వ్యవసాయం అంటే ఇప్పుడు కేవలం పొలంలో పనిచేయడం మాత్రమే కాదు.. అగ్రి టెక్ కంపెనీలు, సీడ్ ఇండస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ పరిశోధన సంస్థలు, డ్రోన్ టెక్నాలజీ, హార్టికల్చర్, అగ్రి స్టార్టప్, ఎగుమతి సంస్థలు, డిజిటల్ అగ్రికల్చర్ వంటి రంగాల్లో వేలాది ఉద్యోగ అవకాశాలు విస్తరిస్తున్నాయి.
సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైమ్ అందుబాటులోకి వచ్చిన క్రేజీ కోర్స్
ఒకప్పుడు వ్యవసాయం అంటే నాగలి, ట్రాక్టర్, ఎరువులు మాత్రమే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. డ్రోన్లు ఎగురుతూ పంటలకు మందులు పిచికారీ చేస్తున్నాయి. సెన్సార్లు నేలలో తేమను కొలుస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రైతుకు ఎప్పుడు విత్తనం వేయాలో, ఎప్పుడు నీరు పెట్టాలో, ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందో ముందుగానే చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం పూర్తిగా టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. దీంతో అగ్రి-టెక్ రంగంలో నైపుణ్యం కలిగిన యువతకు భారీగా డిమాండ్ పెరుగుతోంది.
ఈ మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సంప్రదాయ వ్యవసాయానికి అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ B.Sc Agricultureతో పాటు B.Sc Agritech (Hons.) వంటి ప్రత్యేక కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది కావేరి విశ్వవిద్యాలయం. దక్షిణ భారతదేశంలోనే ఈ ప్రత్యేక కోర్సును అందిస్తున్న తొలి విశ్వవిద్యాలయం కావడం విశేషం.
ఈ కోర్సులో అగ్రికల్చర్‌తో పాటు వెబ్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ అప్లికేషన్ల రూపకల్పన, రోబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీ, స్మార్ట్ ఫార్మింగ్, ప్రెసిషన్ ఫార్మింగ్ వంటి అత్యాధునిక అంశాలను బోధిస్తారు. నీటి వినియోగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన ఇజ్రాయెల్ వ్యవసాయ విధానాలు కూడా విద్యార్థులకు పరిచయం చేస్తారు. దీంతో విద్యార్థులు వ్యవసాయ టెక్నాలజీ నిపుణులుగా ఎదిగే అవకాశం ఉంటుంది.
ఈ విశ్వవిద్యాలయానికి ప్రముఖ వ్యవసాయ ఉత్పత్తుల సంస్థ కావేరి సీడ్స్ మద్దతు ఉండటం మరో ప్రత్యేకత. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణతో పాటు క్యాంపస్‌లోనే DGCA ఆమోదిత డ్రోన్ ట్రైనింగ్ అందిస్తున్నారు. ఇప్పటికే ప్రస్తుత బ్యాచ్‌లో పలువురు విద్యార్థులు ఈ సర్టిఫికేషన్ పూర్తి చేశారు. డ్రోన్ ఆపరేటర్లకు వ్యవసాయ సంస్థల్లో మంచి డిమాండ్ ఉండగా, కొన్ని ప్రముఖ కంపెనీలు నెలకు రూ.45 వేల వరకు వేతనాలతో అవకాశాలు కల్పిస్తున్నాయి.
ఇదే కాకుండా వర్మీ కంపోస్టింగ్ సర్టిఫికేషన్, పరిశ్రమల అనుసంధానంతో కూడిన ప్రాక్టికల్ ట్రైనింగ్, ఆధునిక వ్యవసాయ ల్యాబ్‌లు, హైటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి సదుపాయాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. చదువుతున్నప్పుడే పరిశ్రమ అనుభవం పొందేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
వ్యవసాయం ఇక పొలం వరకే పరిమితం కాదు. అగ్రి-టెక్ కంపెనీలు, డ్రోన్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రి స్టార్టప్‌లు, ప్రెసిషన్ ఫార్మింగ్, డిజిటల్ అగ్రికల్చర్ వంటి రంగాల్లో వేలాది ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. రాబోయే కాలంలో వ్యవసాయాన్ని నడిపేది టెక్నాలజీయే. ఆ భవిష్యత్‌లో భాగం కావాలనుకునే విద్యార్థులకు ఈ కోర్సులు మంచి వేదికగా మారుతున్నాయి. మరెందుకు ఆలస్యం.. భవిష్యత్ అగ్రి-టెక్ కెరీర్‌కు ఇప్పుడే తొలి అడుగు వేయండి. అడ్మిషన్ల కోసం వెంటనే 92814 16210 నంబర్‌ను సంప్రదించండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

