నేడు మంత్రివర్గ సమావేశం

- ధాన్యం సేకరణలో కేంద్రంపై పోరుకు కార్యాచరణ!
- ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే ప్రణాళిక, రైతు అమరులకు ఎక్స్‌గ్రేషియా అందజేతపై చర్చించే అవకాశం
హైదరాబాద్, నవంబర్ 28, (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం ప్రగతిభవన్‌లో జరుగనున్నది. ఈ సమావేశంలో వరి ధాన్యం సేకరణ విషయంలో కేందప్రభుత్వ వైఖరిపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నది. కేంద్రం ధాన్యాన్ని సేకరించేలా వత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. యాసంగిలో వరిధాన్యం తీసుకోబోమని కేంద్రం తెగేసి చెప్పటంతో ఇతర పంటల సాగుపై రైతులకు సూచనలు చేసే విషయంపై కూడా క్యాబినెట్లో చర్చించనున్నారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రాష్ట్రంలో ప్రవేశించకుండా అడ్డుకొనే చర్యలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది. ముప్పును ఎదుర్కొనేందుకు సంబంధిత శాఖలన్నింటినీ సిద్ధంచేసే ప్రణాళికపై సీఎం సూచనలు చేయనున్నట్టు తెలిసింది. వివాదాస్పద సాగుచట్టాలపై పోరాటంలో అసువులుబాసిన రైతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించే అంశంపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. వీటితోపాటు పోడుభూములు, దళితబంధు తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

