ఆస్కార్ షార్ట్‌ఫిల్మ్‌కు మద్దతు
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 80కిపైగా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన భారతీయ షార్ట్‌ఫిల్మ్ ‘వీ వెర్ హియర్' ఆస్కార్ అవార్డుల బరిలో అర్హత సాధించిన విషయం తెలిసిందే.
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 80కిపైగా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన భారతీయ షార్ట్‌ఫిల్మ్ ‘వీ వెర్ హియర్’ ఆస్కార్ అవార్డుల బరిలో అర్హత సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి తన మద్దతు ప్రకటిస్తూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతల్ని స్వీకరించింది అగ్ర కథానాయిక ప్రియాంక చోప్రా. ముగ్గురు రిటైర్డ్ ఉద్యోగులు చుట్టూ తిరిగే కథ ఇది. యంత్రాలు మనుషుల ఉద్యోగాల్ని ఆక్రమిస్తున్నాయని నిరసన వ్యక్తం చేస్తూ వారు వినూత్న కార్యక్రమాల్ని మొదలుపెడతారు.
ఈ నేపథ్యంలో హాస్యం, సందేశం ప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. సాంకేతిక పరిజ్ఞానం పైచేయి సాధించి మనుషుల ప్రాధాన్యం తగ్గిపోతుందనే బలమైన అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కావడం పట్ల ప్రియాంకచోప్రా ఆనందం వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ ‘అద్భుతమైన ఆలోచనతో సినిమా తీసిన చిత్రబృందాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా బాధ్యతలు తీసుకున్నా. తప్పకుండా ఆస్కార్‌లో విజేతగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’ అని చెప్పింది. ఈ షార్ట్ ఫిల్మ్‌కు ప్రణవ్ భాసిన్ దర్శకత్వం వహించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

