మహా ‘ట్విస్ట్’ ఉండనుందా.. ఠాక్రే సోదరులతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి తెర లేవనుందా? అధికార మహాయుతి కూటిమిలో విభేదాలు బయటపడుతున్న వేళ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎస్ఎన్) చీఫ్ రాజ్ ఠాక్రే ఒకే వేదికపై కనిపించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
- మహాయుతి కూటమిలో విభేదాలతో కొత్త సమీకరణాలపై చర్చ
ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి తెర లేవనుందా? అధికార మహాయుతి కూటిమిలో విభేదాలు బయటపడుతున్న వేళ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎస్ఎన్) చీఫ్ రాజ్ ఠాక్రే ఒకే వేదికపై కనిపించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వీరు ముగ్గురు ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా, ఒకే గదిలో ఏదో విషయమై చర్చించుకుంటున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.
2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వరకు బీజేపీ, ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కలిసి మహాయుతి కూటమిగా ఐక్యతను ప్రదర్శించాయి. అయితే తాజాగా పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూటమిలో విభేదాలను బయటపెట్టాయి. ఎన్నికల్లో సమన్వయ లోపమే ఓటమికి కారణమంటూ బీజేపీ, శివసేన నేతలు పరస్పరం విమర్శించుకోవడం ప్రారంభించారు. ఇటువంటి సమయంలోనే ముంబైలో జరిగిన ‘ది లాఫ్టర్ లైన్స్ ఆఫ్ మహారాష్ట్ర’ పుస్తకావిష్కణ కార్యక్రమంలో ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఒకే వేదికపై కనిపించారు. ఈ సందర్భంగా ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలతో ఫడ్నవీస్ సన్నిహితంగా మాట్లాడటం కొత్త రాజకీయ సమీకరణాలపై ఊహాగానాలకు తెరలేపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

