తెలుగు యూనివర్సిటీ, ఫిబ్రవరి 12: నిజాంకాలంలో ఏర్పడిన నాటి ఆంధ్ర సారస్వతపరిషత్తుపై ఏపీ తప్పుడు ప్రచారం చేస్తున్నదని తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జే చెన్నయ్య తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
నిజాంకాలంలో తెలుగు భాషా సాహిత్య పరిరక్షణ కోసం 1943లో ఏర్పడి, 2014లో తెలంగాణ సారస్వత పరిషత్తుగా పేరు మారిందని, 83 ఏండ్లుగా తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం నిరంతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఏపీలో వెలసిన ఆంధ్ర సారస్వతపరిషత్తు అలనాటి సారస్వతపరిషత్తుగా ప్రచారం చేసుకోవడం సరికాదని ఈ విషయాన్ని గమనించాలని వారు కోరారు.