నల్ల కలువకూ, మల్లెపువ్వుకూ పోటీ పెడతారా? అని ఆగ్రహంగా ప్రశ్నిస్తాడో కవి. నిజమే, ఏ రంగు హంగు ఆ రంగుదే. ఏ పువ్వు సౌకుమార్యం ఆ పువ్వుదే.
మల్లె మల్లే! మందారం మందారమే! ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’ ఆధారంగా మాధవన్ కోహ్లీ అనే టెక్-కళాకారుడు వివిధ ప్రాంతాల మహిళల రూపురేఖలకు ప్రాణం పోశాడు. ఆ చిత్రాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక్కడ కనిపిస్తున్నది తమిళ సుందరి.