Heart Attack | పర్వతగిరి, మార్చి 30: విధులకు హాజరైన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు పాఠశాలలోనే గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్నగర్ శివారు టూక్యానగర్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం చోటుచేసుకున్నది.
సంగెం మండలం కాట్రపల్లికి చెందిన ఉపాధ్యాయుడు పోశాల చంద్రశేఖర్ (46) ఉదయం నుంచే నలతగా ఉన్నదని పాఠశాలకు చేరుకున్నారు. ఏకోపాధ్యాయ పాఠశాల కావడంతో కొద్దిసేపు విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఆయనకు ఛాతిలో నొప్పితో కుప్పకూలిపోయాడు. కొద్దిసేపు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ప్రైవేట్ ద వాఖానకు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు.