TCS Job Mela | ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న మహిళా వృత్తి నిపుణులకు ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గుడ్‌న్యూస్ చెప్పింది. డిగ్రీ, పీజీ పూర్తి చేసి, ఐటీలో ఐదేండ్లలోపు అనుభవం గల మహిళా నిపుణుల కోసం మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తోంది. నైపుణ్యం, సామర్థ్యం, అనుభవం గల మహిళా వృత్తి నిపుణులు ఐటీలో తమదైన ముద్ర వేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు టీసీఎస్ తెలిపింది.
వారి నైపుణ్యం మెరుగు పర్చడమే కాదు.. నచ్చిన విభాగంలో మరింత నైపుణ్యం పెంచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నట్లు పేర్కొంది. నిపుణులకు అర్హతలకనుగుణంగా దేశవ్యాప్తంగా నియామకాలు చేస్తామని వెల్లడించింది. అంతే కాదు అర్హులైన వారికి వారి ఈ-మెయిల్‌కు ఇంటర్వ్యూ వివరాలు అందుతాయి.