TCS | ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ (Tata Consultancy Services) కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ (Hybrid Work Policy)కు పూర్తిగా స్వస్తి పలకాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే కఠిన నిర్ణయాలను అమలు చేస్తోంది. వర్క్-ఫ్రమ్-ఆఫీస్ విధానాన్ని మరింత కఠినతరం చేసింది. ఇకపై ఉద్యోగులు కచ్చితంగా ఆఫీస్‌కు రావాల్సిందేనని స్పష్టం చేసింది. లేనిపక్షంలో వారి యాన్యువల్ ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ వంటివి నిలిపివేస్తామని హెచ్చరించింది. ప్రస్తుతం టీసీఎస్ ఉద్యోగులు రోజుకు 9 గంటలు ఆఫీసులో గడపాలి.
దేశంలోని ఇతర ఐటీ కంపెనీలు వారానికి రెండు లేదా మూడు రోజులు ఆఫీస్‌కు వస్తే చాలని చెబుతున్నారు. కానీ టీసీఎస్ మాత్రం ఐదు రోజులు కచ్చితంగా రావాలని నిబంధన పెట్టింది. అంతేకాకుండా వేరియబుల్ పే (Variable Pay)ను కూడా అటెండెన్స్‌తో లింక్ చేసింది. కంపెనీ నిర్ణయంతో సంస్థలోని ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఈ నిర్ణయంపై ఉద్యోగులు పలు విధాలుగా స్పందిస్తున్నారు. పెరిగే జీతం కంటే ఆఫీసుకు వెళ్లేందుకు అయ్యే ఖర్చే ఎక్కువ అని వాపోతున్నారు. పెరుగుతున్న అద్దెలు, రవాణా, భోజన ఇతర ఖర్చులను సాకుగా చూపుతూ చాలా మంది వర్క్‌ఫ్రమ్ హోమ్‌కే మొగ్గు చూపుతున్నారు.
Also Read..
S Jaishankar | యూఎస్‌లో 670 కిలోమీటర్లు రోడ్డుమార్గంలోనే ప్రయాణించిన జైశంకర్
Nitin Gadkari | రోడ్డు ప్రమాదాల నివారణకు వీ2వీ సాంకేతిక పరిజ్ఞానం : నితిన్ గడ్కరీ
Shashi Tharoor | నేను నెహ్రూని ఆరాధిస్తా.. కానీ ఆయన విధానాలను సమర్థించను : శశి థరూర్