కాంగ్రెస్ పాలనలో సింగరేణి నిర్వీర్యం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. ఎప్పుడూ లేని విధంగా కుంభకోణాలు, అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు.
- టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి
గోదావరిఖని, అక్టోబర్ 15: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. ఎప్పుడూ లేని విధంగా కుంభకోణాలు, అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు.
గురువారం ఆయన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు. సంస్థ పరిస్థితి అగమ్యగోచరంగా మారిన క్రమంలో ఈ విషయాన్ని కార్మికులకు తెలియజేసి చైతన్యవంతం చేసేందుకే బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు సింగరేణి కార్మిక గర్జన సభ నిర్వహించినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం, యాజమాన్యం జిమ్మికులు చేస్తూ లాభాల వాటా ప్రకటించినట్టు కార్మికులు గుర్తించారని, అందుకే అసంతృప్తి వెళ్లగక్కేందుకు చైతన్యవంతమై ఊహించని రీతిలో వేలాదిమంది తరలివచ్చినట్టు తెలిపారు.
లాభాల వాటాలో కోత, కారుణ్య నియామకాలు, సంక్షేమ పథకాలను తొక్కిపెట్టడం, సొంత ఇంటి పథకానికి ఎలాంటి కార్యాచరణ లేకపోవడం వంటి కారణాలు కార్మికులను సభకు తీసుకువచ్చాయని వివరించారు. సభ విజయవంతానికి కృషిచేసిన, ఎప్పటికప్పుడు బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నేతలతో మాట్లాడిన కేటీఆర్, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, ముఖ్య నేతలు, సభకు తరలివచ్చిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

