ఏసీబీ వలలో అవినీతి అధికారులు.. ఒకేరోజు మూడు వేర్వేరు ఘటనల్లో ఆరుగురిని అరెస్టు చేసిన అధికారులు
భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఘటనలలో మల్కాజిగిరి జిల్లా కీసర మండలంలో డిప్యూటీ తహసీల్దార్‌తోపాటు ఆయన కిందపనిచేసే ఇద్దరు సిబ్బంది, వేములవాడలో తహసీల్దార్, భూభారతి ఆపరేటర్, హైదరాబాద్‌లో విద్యుత్తు ఏఈని ఏసీబీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
- అరెస్టయిన వారిలో డిప్యూటీ తహసీల్దారు, తహసీల్దారు, ఒక ఏఈ
కీసర/సైదాబాద్, అక్టోబర్ 15 : గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గురువారం ఒకేరోజు పలువురు ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి దొరికిపోయారు. మూడు జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఘటనలకు సంబంధించి అరెస్టయిన వారిలో తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ సెక్షన్ అసిస్టెంట్, భూభారతి ఆపరేటర్, ఓ విద్యుత్తు అసిస్టెంట్ ఇంజినీర్ ఉన్నారు. భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఘటనలలో మల్కాజిగిరి జిల్లా కీసర మండలంలో డిప్యూటీ తహసీల్దార్‌తోపాటు ఆయన కిందపనిచేసే ఇద్దరు సిబ్బంది, వేములవాడలో తహసీల్దార్, భూభారతి ఆపరేటర్, హైదరాబాద్‌లో విద్యుత్తు ఏఈని ఏసీబీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. కీసరలో 22ఏ నిషేధిత జా బితా నుంచి భూమిని తొలగించేందుకు రూ.5 లక్షలు డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్ సందీప్‌రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ విజయ్‌కుమార్‌రెడ్డి, రికార్డు సెక్షన్ అసిస్టెంట్ బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ వెల్లడించారు.
కీసరకు చెందిన పన్నాల గిరిధర్‌రెడ్డి తన తల్లి పేరు మీదున్న సర్వేనంబర్ 183, 184లోని మూడెకరాల భూమిని తనపేరిట బదిలీ చేయాలని కీసర రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నారు. దాదాపు ఆరు నెలల పాటు మండల కార్యాలయం చుట్టూ తిరిగినా తన పని కాలేదు. అయితే రూ.5 లక్షలు లంచం ఇస్తేనే పనిచేస్తానని డిప్యూటీ తహసీల్దార్ సందీప్‌రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై గిరిధర్‌రెడ్డి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి పథకం ప్రకారం గిరిధర్‌రెడ్డి తొలుత రూ.2.50 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఆ మేరకు రూ.2.50 లక్షలు డిప్యూటీ తహసీల్దార్ సందీప్‌రెడ్డికి ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని ఏసీబీ డీసీపీ తెలిపారు. ఈ కేసులో జూనియర్ అసిస్టెంట్ విజయ్‌కుమార్‌రెడ్డి, రికార్డు అసిస్టెంట్ బాలకృష్ణ కూడా అతనికి సహకరించారని, మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామని చెప్పారు. గత నెల 19న కీసర సీఐ, ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డి రూ.5 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీలకు చిక్కిన సంఘటన మరువక ముందే కీసర తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు ఏసీబీకి చిక్కడం సంచలనంగా మారింది.
కొత్త మీటర్లు ఇచ్చేందుకు లంచం
కొత్త విద్యుత్తు మీటర్ మంజూరు చేయడానికి రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటుండగా ట్రాన్స్‌కో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ)ని ఏసీబీ సిటీ రేంజ్-2 అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం సంతోష్‌నగర్ సబ్ డివిజన్ (టీజీఎస్పీడీసీఎల్)లోని ఆయన కార్యాలయంలో సోదాలు చేశారు. ఓ వినియోగదారుడికి సంబంధించిన విద్యుత్తు మీటర్లు కనిపించకుండా పోవడంతో వాటి స్థానికంగా నివసించే ఒక వ్యక్తికి సంబంధించిన పాత విద్యుత్ మీటర్లు కన్పించకుండా పోవటంతో వాటి స్థానంలో కొత్తగా ఆరు మీటర్లకు అనుమతులు ఇచ్చేందుకు ఏఈ పండాల సంధ్యారాకేశ్ రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్టు సమాచారం. దీనిపై బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు బాధితుడు గురువారం మధ్యాహ్నం మాదన్నపేటలో లంచం మొత్తం ఇస్తానని ఏఈకి చెప్పాడు. ఆ మేరకు ఏఈ రాకేశ్ బాధితుని వద్ద లంచం డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతని నుంచి రూ.1.20 లక్షలు స్వాధినం చేసుకున్నారు. అనంతరం నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను వెల్లడించటంలేదని, నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని ఏసీబీ అధికారులు తెలిపారు.
గిఫ్ట్ రిజిస్ట్రేషన్‌కు 8వేలు లంచం
వేములవాడ రూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ భూమి రిజిస్ట్రేషన్ విషయంలో వేములవాడ రూరల్ తహసీల్దార్ లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళా రైతు.. తన భూమిని తన తమ్ముడి పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు సెప్టెంబర్‌లో స్లాట్ బుక్ చేసుకున్నారు. ఆ స్లాట్ రిజెక్ట్ కావడంతో ఆమె తహసీల్దార్ అబూబకర్‌ను సంప్రదించారు. లంచం ఇవ్వనిదే పని జరుగదని తహసీల్దార్ తేల్చి చెప్పడంతో ఆమె రూ.10వేలు ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే దీనిపై ఆమె ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వేములవాడ రూరల్ తహసీల్ ఆఫీస్‌లో గురువారం తహసీల్దార్ అబూబకర్ ఆదేశాల మేరకు భూభారతి ఆపరేటర్ అనిల్ ఆమె నుంచి రూ.8వేలు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేసి ఇద్దరినీ పట్టుకున్నారు. కార్యాలయానికి తాళం వేసి దాదాపు మూడు గంటలపాటు తనిఖీలు చేశారు. ప్రజలతోపాటు ప్రజాప్రతినిధుల పట్ల దురుసుగా వ్యవహరిస్తారనే ఆరోపణలున్న అబూబకర్ అరెస్టు కావడంపై ఆయన బాధితులు తహసీల్ ఆఫీసు ఎదుట పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

