Tatikonda Rajaiah | వరంగల్ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తోంది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రామక్క పాటకు డ్యాన్స్ చేసి గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. రాజయ్య డ్యాన్స్ చేసినంత సేపు వేదికంతా దద్దరిల్లిపోయింది.
డ్యాన్స్ చేసే కంటే ముందు కడియం శ్రీహరిపై రాజయ్య ధ్వజమెత్తారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీకి మోసం చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాజయ్య. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, ఇదే ఘన్‌పూర్‌లో నువ్వా.. నేనా చూసుకుందాం అని కడియంకు రాజయ్య సవాల్ విసిరారు. కడియంపై రగిలిపోయిన రాజయ్య తన ప్రసంగాన్ని ముగించిన తర్వాత అక్కడే ఉన్న కార్యకర్తలు ఆయనను ప్రశంసిస్తూ తమ భుజాలపై ఎత్తుకున్నారు. ఆ సంతోషంలో రాజయ్య కూడా రామక్క పాటకు స్టెప్పులేసి.. కార్యకర్తల్లో మరింత జోష్‌ను నింపారు.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం మీటింగులో డాన్స్ చేసిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య. pic.twitter.com/Ysc5TQ1nyx
— Telugu Scribe (@TeluguScribe) April 19, 2024