దేశవ్యాప్తంగా టాటా పవర్ ఈవీ చార్జింగ్ స్టేషన్లు…

ఢిల్లీ, జూలై : దేశంలో మరికొన్ని చోట్ల ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుచేసేందుకు టాటా పవర్ సంస్థ ముందుకొచ్చింది. అందులోభాగంగా టాటా పవర్ ,హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) తో భాగస్వామ్యం చేసుకున్నది. భారతదేశంలోని నగరాలు ,ప్రధాన రహదారులలోని హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉపయోగకరంగా ఉండేదుకు మరిన్నిచార్జింగ్ స్టేషన్లను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
టాటా పవర్ ఇప్పటివరకు 100 నగరాల్లో 500లకు పైగా చార్జింగ్ స్టేషన్లను ప్రారంభించింది. టాటా పవర్, మెట్రో స్టేషన్, షాపింగ్ మాల్, సినిమా హాల్,హైవే వంటి ప్రాంతాల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడానికి మౌలిక సదుపాయాలు చాలా అవసరం, కాబట్టి చార్జింగ్ స్టేషన్లను పెంచాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్నిపెంచడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక చర్యలు తీసుకుంటున్నాయి. టాటా పవర్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి వాటికీ ప్రభుత్వాలు సహకరిస్తాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడానికి ప్రభుత్వాలు భారీ రాయితీలు ప్రకటిస్తున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

