తాండూర్ : మంచిర్యాల జిల్లా తాండూర్ (Tandoor) పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ వర్షాల ( Heavy Rains ) కారణంగా వరదలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఎస్సై కిరణ్ కుమార్ ( SI Kiran Kumar ) సిబ్బందితో కలిసి వెళ్లి వాగులు ప్రవహిస్తున్న కల్వర్టు ప్రాంతాలను పరిశీలించారు. అచలాపూర్ గ్రామంలో భావoడ్ల పెళ్లి నరేష్ ఇంట్లోకి వరద నీరు చేరిన దృశ్యాన్ని చూసి సంబంధిత అధికారులకు సమాచారాన్ని అందజేశారు.
భారేపల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయ ప్రహరీ గోడా వరద నీటికి కొంతమేర పాక్షికంగా కూలియింది. గజ్జలపల్లి, రేచిని, బారేపల్లి గ్రామాల మధ్య గల కల్వర్టుల వద్ద భారీ వర్షాలకు అధిక నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటువైపు వెళ్లే ప్రయాణికులు వరద నీటి ఉదృతం తగ్గిన తర్వాత వెళ్లాలని ఎస్సై సూచించారు. అత్యవసర సమయాల్లో ప్రజలు 100 నంబర్‌కు, స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిస్తే సహాయ చర్యలు చేపడుతామన్నారు.