హైదరాబాద్, ఆట ప్రతినిధి: లేహ్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా వింటర్గేమ్స్లో రాష్ర్టానికి చెందిన యువ స్కేటర్ తాల్లూరి నయన శ్రీ రెండు పసిడి పతకాలతో మెరిసింది. టోర్నీలో సోమవారం జరిగిన మహిళల 1000మీటర్ల షార్ట్ట్రాక్ స్కేటింగ్లో నయన శ్రీ అగ్రస్థానంలో నిలిచింది. 1:43:32 సెకన్ల టైమింగ్తో లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణం ఖాతాలో వేసుకుంది.
అంతకుముందు జరిగిన 500మీటర్ల విభాగంలోనూ నయన తొలి స్వర్ణం దక్కించుకుంది. మరోవైపు పురుషుల 1000మీటర్ల షార్ట్ ట్రాక్ విభాగంలో రాష్ట్ర స్కేటర్లు విష్ణువర్ధన్(1:40:72సె) రజతంతో మెరువగా, శివమణికం(1:44:19సె) కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు.