నార్కట్పల్లి జనవరి 26 : ప్రసిద్ధ శైవ క్షేత్రమైన చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున పార్వతీ జడల రామలింగేశ్వరుల కల్యాణం వైభవోపేతంగా జరిగింది. ప్రభుత్వ తరఫున నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం దంపతులు స్వామి వార్లకు, అమ్మవారికి పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఓం నమఃశివాయ. అంటూ భక్తులు నామ స్మరణతో శివ సత్తుల కోలాటాల మధ్య ఉత్తరాయణ పుణ్యకాలం, మా ఘ శుద్ధ సప్తమి (రథసప్తమి) గడియలో యాజ్ఞికులు అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షితావధాని పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో వేద మం త్రాల మధ్య పరిణయ తంతు వైభవం గా జరిగింది. అంతకుముందు తెల్లవా రుజామున 2 గంటల నుంచే సుప్రభా త సేవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మూడు గంటలకు పారాయణం, అన్నాభిషేక మహా నివేదనం నిర్వహించి ఉదయం 4 గంటల 5 నిమిషాలకు మేళతాళాలతో శివ సత్తుల నృత్యాల నడుమ స్వామి వారిని నంది వాహనంపై, అమ్మవారిని గజ వాహనంపై ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించి కల్యాణ మండపానికి స్వాముల వారిని తోడ్కొని వచ్చారు.
సువర్ణ పుష్పాది బిల్వాలతో దివ్యాలంకరణతో శోభితమైన కల్యాణ వేదికపై పద్మాసనంపై ఉత్సవమూర్తులు ఆసీనులు కాగా సప్తనది జలాలతో కూడిన మంత్ర జలం చల్లి కల్యాణ వేదికను శుద్ధి ్దచేసి బ్రహ్మ, విష్ణువు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. అనంతరం కల్యాణ మండపం వద్ద సంప్రదాయ బద్ధంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, రక్షాసూత్రాధరణ, 5 గంటల 5 నిమిషాలకు జిలకర్ర బెల్లం పెట్టించారు. అమ్మవారికి రక్షా సూత్రాధరణ చేశారు. ఈ సందర్భంగా కల్యాణం తిలకించేందుకు టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కల్యాణ తంతు వీక్షించే సమయంలో ఆటంకం ఎదురైంది. చేతికి కంకణాలు, స్వామివారి హారతి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. స్వామివారికి తలంబ్రాలు సమర్పించే సమయంలో ఆటంకం ఎదురైందని భక్తులు మండిపడ్డారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో మోహన్ బాబు, సిబ్బంది ఏర్పాట్లు చేశారు.
పార్వతీ పరమేశ్వరుల కల్యాణాన్ని తిలకించేందుకు జిల్లా నలు మూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చా రు. గట్టుపై కాకుండా గట్టు కింది నుంచి ఘాట్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న రోడ్లు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులకు అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులు కల్పించినట్లు ఈవో తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని నల్లగొండ ఎస్సీ శరత్ చంద్ర పవా ర్ సూచనలతో డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు భారీ బందోబస్తు నిర్వహించారు.