జాతీయ నటుడు మోహన్‌లాల్ కథానాయకుడిగా ‘మెప్పాడియన్’ఫేం విష్ణు మోహన్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్నది. ‘ఎల్ 367’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ భారీ పానిండియా చిత్రానికి గోకులం గోపాలన్ నిర్మాత. మలయాళ అగ్ర నిర్మాణ సంస్థ గోకులం మూవీస్ చరిత్రలోనే భారీ సినిమాగా ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు నిర్మాత పేర్కొన్నారు.
భారీ కాన్వాస్‌తో రూపొందనున్న ఈ చిత్రంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులతోపాటు, ఫారిన్ నటీనటులు కూడా నటిస్తారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్నది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియరానున్నాయి.