బజార్ హత్నూర్: వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై ( Seasonal diseases ) ప్రజలు జాగ్రత్తలు వహించాలని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ (DMHO Rathod Narender) కోరారు. మండలంలోని టెంబి గ్రామంలో వైద్య శిబిరాన్ని సందర్శించి గ్రామస్థులతో మాట్లాడారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఇంటి చుట్టూ మురికి కాల్వల్లో నీటి నిల్వ ఉండడం వల్ల దోమలు అధికమవుతాయని , నీటి నిల్వ ఉన్నచోట శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లాలని సూచించారు.
వర్షాకాలంలో బోర్లలో నీరు మారుతుందని, త్రాగునీరు విషయంలో జాగ్రత్తలు వహించాలన్నారు. వైద్య శిబిరం ప్రక్రియను ఆయన సందర్శించి పలు సూచనలు చేశారు. . ఈ కార్యక్రమంలో వైద్యురాలు అలేఖ్య, వైద్య సిబ్బంది దివ్య, సుశీల, రాణి, రవీందర్, అభిషేక్, రవి, గాజుల రమేష్, విజయ, మంజుల ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.