తుంగతుర్తి, అక్టోబర్ 23 : తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్‌పై కాంగ్రెస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు తడకమళ్ల రవికుమార్ అన్నారు. గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. తుంగతుర్తి నియోజకవర్గాన్ని పదేండ్లు అభివృద్ధి పథంలో నడిపించిన కిశోర్ కుమార్ పై కాంగ్రెస్ పార్టీ నాయకులు బూతు పదజాలంతో దూషించడం సరికాదన్నారు. తమ ఊర్లలో వార్డు మెంబర్ గా కూడా గెలవలేనివాళ్లు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ అగ్ర నేతలు కేటీఆర్, హరీష్ రావులపై బూతు పదజాలంతో ఇష్టానుసారం మాట్లాడడాన్ని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ మీడియా సమావేశం ద్వారా ఖండించినట్లు తెలిపారు.
గతంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి జడ్పిటిసి గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసింది నిజం కాదా? వంకాయ గుర్తు వచ్చింది నిజం కాదా? 100 ఓట్లు వచ్చింది నిజామా కాదా అని ఆయన ప్రశ్నించారు. సోషల్ మీడియా ద్వారా గాదరి కిశోర్ పై బూతు పదజాలంతో దుర్భాషలాడిన వ్యక్తులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు గుడిపాటి వీరయ్య, గడ్డం సోమేశ్, చింతకుంట్ల సురేశ్, బొజ్జ సాయికిరణ్, బొంకురి శ్రీనివాస్, కొండగడుపుల వెంకటేశ్, బొంకురి మధు, తడకమళ్ల రవికుమార్, మల్లికార్జున్, బొంకూరి సాయి, తడకమళ్ల రవికుమార్, మధు, కడియం గోపి, పోతరాజు భాను, పోతరాజు మహేశ్, బొంకురి ప్రసాద్, బన్ని పాల్గొన్నారు.