హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)క్రీడలకు పెద్దపీట వేస్తున్నది. వనస్థలిపురం సచివాలయనగర్‌లో రూ.3 కోట్లతో అత్యాధునిక వసతులతో స్విమ్మింగ్‌పూల్‌ను నిర్మించింది. 25మీX 15మీ సైజుతో నిర్మించిన ఈ స్విమ్మింగ్ పూల్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. త్వరలో స్మిమర్లకు అందుబాటులోకి రానున్న పూల్‌లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. ఇందులో బాలురు, బాలికలకు వేర్వేరుగా వాష్‌రూమ్స్, ఆరు ఔట్‌డోర్ షవర్స్ ఏర్పాటు చేశారు. వీటితో పాటు కోచ్ రూమ్, స్టోర్‌రూమ్, వెయిట్హాల్ను నిర్మించారు. ప్రహారీ గోడలపై చూడచక్కని చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వనస్థలిపురం స్విమ్మింగ్ పూల్ ప్రారంభానికి సిద్ధం కాగా, కాటేదాన్, లాలపేట్‌లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయని జీహెచ్ఎంసీ అధికారి ఒకరు పేర్కొన్నారు.