ధర్మపురి: షార్జా వేదికగా ఇటీవల జరిగిన తొలి ఆసియా యూనివర్సిటీ పవర్‌లిఫ్టింగ్ టోర్నీలో పసిడి పతకంతో మెరిసిన రాష్ట్ర యువ లిఫ్టర్ రంగు విరంచి స్వప్నికకు తగిన గుర్తింపు లభించింది. అంతర్జాతీయ టోర్నీలో రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసిన స్వప్నికకు బుధవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ లక్ష రూపాయల నగదు ప్రోత్సాహం అందజేశారు. భవిష్యత్‌లో జరిగే టోర్నీల్లో పోటీపడేందుకు తగిన సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్వప్నిక కుటుంబసభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.