మెదక్, మార్చి 17: జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు సంబంధించి భూ సేకరణ, సర్వే పనులు వేగవంతం గా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ నీటి పారుదల, రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించారు. గురువా రం సంబంధిత అధికారులు, వర్క్ ఏజెన్సీలతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డిస్ట్రిబ్యూటరీ కాలువ నిర్మాణానికి భూ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా ఉపేక్షింబోమని ఏజెన్సీలను హెచ్చరించారు. రామాయంపేట కాలువకు సంబంధించి భూ సేకరణ పను లు, చిన్నశంకరంపేట డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణానికి పెగ్ మార్కింగ్ వెంటనే పూర్తి చేయాలన్నారు. అలాగే 13, 15ఫ్యాకేజీలకు సంబంధించి పెగ్ మార్కింగ్ చేయాలని ఏజెన్సీలకు సూచించారు. కాలువ నిర్మాణానికి ఇప్పటి వర కు ఎంత భూమి సేకరించారు. ఇంకా సేకరించకపోవడానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించి వీలైనంత త్వరగా భూ సేకరణ చేసి సర్వే పనులను పూర్తి చేసి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించా రు. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజినీరు శ్రీనివాస్, సర్వే అండ్ ల్యాండ్ రికా ర్డ్స్ సహాయ సంచాలకులు గంగయ్య పాల్గొన్నారు.
మెదక్, మార్చి 17 : ప్రగతిలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాల్సిందిగా జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ కనకరత్నాన్ని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల ప్రగతిని సమీక్షిస్తూ.. జిల్లాలో 3,905 ఇండ్ల నిర్మాణాలకు టెండర్లు పూర్తి కాగా 3,612గృహ నిర్మాణాలు చేపట్టామని ఇందులో 2,245 గృహాల నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగతా గృహాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. వీటి నిర్మాణానికి ఇప్పటి వరకు రూ. 155కోట్ల 35లక్షలు వెచ్చించామని తెలిపారు. గృహ నిర్మాణాలు పూర్తి అయిన ప్రాంతాల్లో పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితా సిద్ధంగా ఉంచుకోవాలని ఆర్డీవోలకు సూచించారు.
జిల్లాలోని 91ప్రాంతాల్లో 4,015డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు మంజూరు కాగా కొన్ని ప్రాంతాల్లో ప్రా రంభించుకున్నామని, మరికొన్ని ప్రాంతాల్లో మౌలిక వసతుల ఏర్పాటుతో ప్రారంభించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని అదనపు కలెక్టర్ రమేశ్ తెలిపారు. ఇసుక సమస్య ఉంటే సంబంధిత ఆర్డీవోలకు తెలపాల్సిందిగా అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఎస్ ఈ కనకరత్నం, ఆర్డీవోలు సాయిరాం, శ్యాంప్రకాశ్, ఉపేందర్‌రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.