హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్టు జేఎన్టీయూ ప్రకటించింది. ఈ నెల 10 నుంచి 21 వరకు వర్సిటీ నియమించిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు తనిఖీలు నిర్వహించగా, వర్సిటీకి అనేక ఫిర్యాదులందాయి. తనిఖీ బృందాలు తూతుమంత్రంగా తనిఖీలు చేసి అంతా సవ్యంగా ఉన్నట్టు నివేదికలు సమర్పించాయి.
తనిఖీల సందర్భంగా ఫ్యాకల్టీని చూపించి, ఆ తర్వాత ఉద్యోగం తొలగించినట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆకస్మిక తనిఖీలకు వర్సిటీ సిద్ధమైంది. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే వెంకటేశ్వర్రావు సర్క్యూలర్ విడుదల చేశారు. వర్సిటీ పరిధిలోని అటానమస్, నాన్ అటానమస్ కాలేజీల్లోని విద్యప్రమాణాలను పర్యవేక్షణ జరుపుతామని, సిద్ధం కావాలని ఆదేశించింది.