గుజరాత్ అల్లర్ల కేసుపై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల (2002) సమయంలో ఆ రాష్ట్ర సీఎంగా ఉన్న నరేంద్రమోదీతో పాటు 64 మందికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) క్లీన్చిట్ ఇచ్చిన ముగింపు నివేదికను, దాన్ని మేజిస్టీరియల్ కోర్టు ఆమోదించడాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. సిట్ క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ నాటి అల్లర్లలో హత్యకు గురైన కాంగ్రెస్ నేత ఎహ్సాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ నేతృతంలోని బెంచ్ జాకియా పిటిషన్‌పై విచారణ చేపట్టింది. సిట్ క్లీన్చిట్ ఇవ్వడం, దానికి ఆమోదం లభించడం కేవలం గుల్బర్గ్ సొసైటీ కేసుకే పరిమితం కాలేదని జాఫ్రీ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ పేర్కొన్నారు. 2002 ఫిబ్రవరి 28న అహ్మదాబాద్‌లోని గుల్బర్గ్ సొసైటీ మారణకాండలో 68 మంది చనిపోయారు.