న్యూఢిలీ: సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్(ఓఎస్ఎం) విధానంపై సుప్రీంకోర్టు బుధవారం ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థులు తీవ్ర నిరాశ చెందారని, మరిన్ని సంస్కరణలు అవసరమని అభిప్రాయపడింది. ఈ విధానంతో ఎంతోమంది యువ విద్యార్థులు అసంతృప్తితో ఉన్నారని సీజేఐ సూర్యకాంత్అన్నారు. దీంట్లో చాలా సమస్యలు ఉన్నాయని తాము విశ్వసిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొన్నది. మూల్యాంకన ప్రక్రియను మెరుగుపరచడానికి తీసుకున్న చర్యలను వివరించాలని సీబీఎస్ఈని కోరడంతోపాటు, కేంద్రం సహకారాన్ని కూడా కోరింది. దీనిపై కేంద్రం స్పందిస్తూ విద్యార్థుల నుంచి వచ్చిన చాలా ఫిర్యాదులు ఇప్పటికే పరిష్కరించామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.