Anant Singh | బహిష్కృత జేడీ(యూ) ఎమ్మెల్యే అనంత్ సింగ్‌కు సుప్రీంకోర్టులో నిరాశ.. డిసెంబర్ 1 లోగా లొంగిపోవాలని ఆదేశం
Anant Singh | బీహార్‌లోని అధికార కూటమికి చెందిన జేడీ(యూ) నుంచి ఇటీవల బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే అనంత్ సింగ్‌కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఆయన మధ్యంతర బెయిల్‌ను పొడిగించడానికి కోర్టు నిరాకరించింది. డిసెంబర్ 1 లోగా లొంగిపోవాలని ఆదేశించింది.
పాట్నా: బీహార్‌లోని అధికార కూటమికి చెందిన జేడీ(యూ) నుంచి ఇటీవల బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే అనంత్ సింగ్‌కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఆయన మధ్యంతర బెయిల్‌ను పొడిగించడానికి కోర్టు నిరాకరించింది. డిసెంబర్ 1 లోగా లొంగిపోవాలని ఆదేశించింది. (Anant Singh) గత ఏడాది నవంబర్ 30న మొకామా అసెంబ్లీ నియోజకవర్గంలో జన సూరజ్ పార్టీ (జేఎస్పీ) అభ్యర్థి పీయూష్ ప్రియదర్శి తరఫున ప్రచారం చేస్తున్న ఆ పార్టీ కార్యకర్త అయిన 75 ఏళ్ల దుల్లార్ చంద్ యాదవ్ హత్యకు గురయ్యారు. ఆయన హత్యకు సూత్రధారిగా వ్యవహరించారనే ఆరోపణలపై గత ఏడాది అక్టోబర్‌లో అనంత్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది మార్చిలో పాట్నా హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
కాగా, ఎమ్మెల్యే అనంత్ సింగ్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జస్టిస్ ఎంఎం సుందరేశ్, ప్రసన్న బి వరలేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపింది. నేర చరిత్ర ఉన్న ఎమ్మెల్యే అనంత్ సింగ్‌కు పాట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఆ బెయిల్‌ను రద్దు చేసింది.
మరోవైపు కుటుంబ వివాహానికి హాజరయ్యేందుకు లభించిన మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలన్న ఎమ్మెల్యే అనంత్ సింగ్ అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. డిసెంబర్ 1 లోగా లొంగిపోవాలని ఆయనను ఆదేశించింది. అలాగే ఈ హత్య కేసు దర్యాప్తును నాలుగు నెలల్లోగా పూర్తి చేయాలని బీహార్ పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు నెలలకు వాయిదా వేసింది.
అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వుపై మొకామా ఎమ్మెల్యే అనంత్ సింగ్ స్పందించారు. భారత న్యాయవ్యవస్థపై తనకు విశ్వాసం ఉన్నదని ఆయన తెలిపారు. ‘నేను లొంగిపోతాను. నాకు న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉన్నది. కోర్టు ఎప్పుడు, ఎక్కడ అడిగినా నేను లొంగిపోతాను’ అని మీడియాతో అన్నారు.
కాగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అనంత్ సింగ్ తోపాటు మాజీ ఎమ్మెల్యే అయిన ఆయన భార్య నీలం దేవిని కూడా ఆరేళ్లపాటు జేడీ(యూ) బహిష్కరించింది. అనంతరం కొద్ది రోజులకే ఈ పరిణామం జరుగడం విశేషం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Helicopter Crash | ఆ హెలికాప్టర్ కూలిపోయింది.. పైలట్ సహా ఆరుగురు దుర్మరణం..!
Anant Singh | బహిష్కృత జేడీ(యూ) ఎమ్మెల్యే అనంత్ సింగ్‌కు సుప్రీంకోర్టులో నిరాశ.. డిసెంబర్ 1 లోగా లొంగిపోవాలని ఆదేశం
Cult Review | ‘కల్ట్’ సినిమా రివ్యూ.. విశ్వక్సేన్ కొత్త సినిమా ఎలా ఉందంటే!
Inter Student | అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Rise | రూ.100 చేరువలో కిలో బియ్యం..! సామాన్య ప్రజల రక్తం తాగుతున్న రైస్ మాఫియా
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

