Supreme Court | ఫామ్ 6, 7, 8లను మార్చలేరు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ
ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, చిరునామా మార్పులకు సంబంధించిన ఫామ్-6, 7, 8లను ఎన్నికల సంఘం ఇష్టానుసారంగా మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష (సర్) ప్రక్రియపై బుధవారం విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఓటర్ల జాబితాలో పేర్లున్న వారిని ముసాయిదా జాబితా నుంచి తొలగిస్తే, తిరిగి వారి పేరును చేర్చడానికి కొత్త ఓటర్ల నమోదు కోసం ఉద్దేశించిన ఫామ్-6 సమర్పించాలని ఎందుకు అడుగుతున్నారని ఈసీని ప్రశ్నించింది.
- ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ
- తొలగించిన ఓటర్లను తిరిగి చేర్చేందుకు ఫామ్ 6 ఎందుకు అడుగుతున్నారని ప్రశ్న
న్యూఢిల్లీ, అక్టోబర్ 28: ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, చిరునామా మార్పులకు సంబంధించిన ఫామ్-6, 7, 8లను ఎన్నికల సంఘం ఇష్టానుసారంగా మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష (సర్) ప్రక్రియపై బుధవారం విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఓటర్ల జాబితాలో పేర్లున్న వారిని ముసాయిదా జాబితా నుంచి తొలగిస్తే, తిరిగి వారి పేరును చేర్చడానికి కొత్త ఓటర్ల నమోదు కోసం ఉద్దేశించిన ఫామ్-6 సమర్పించాలని ఎందుకు అడుగుతున్నారని ఈసీని ప్రశ్నించింది.
నిర్దేశిత ఫామ్‌లను మార్చలేరు
ఫామ్ 6,7,8లు చట్ట నిబంధనల ప్రకారం నిర్దేశించిన ఫారాలని, వాటి రూపాన్ని మార్చడానికి ఈసీకి అధికారం లేదని జస్టిస్ బాగ్చి పేర్కొన్నారు. అయితే, అవసరమైతే అదనపు వివరాలు లేదా ప్రకటనలను జతచేసే అవకాశం ఉందని తెలిపారు. ఢిల్లీలో గతంలో ఓటర్ల జాబితాలో పేర్లున్న వారు ‘సర్’ సమయంలో గణన ఫారాలు సమర్పించలేకపోతే, వారి పరిస్థితికి అనుగుణంగా పరిష్కారం చూపాలని ధర్మాసనం సూచించింది. వారిని కొత్త ఓటర్లుగా పరిగణించి ఫామ్ 6 నింపాలని కోరడం సరికాదని అభిప్రాయపడింది.
ఫామ్ 6 కొత్త ఓటర్ల కోసమే
మొదటిసారి ఓటరుగా నమోదు చేసుకోవాలనుకునేవారి కోసం ఫామ్ 6 ఉద్దేశించినది. చిరునామా మారిన ఓటర్లు వివరాలు సవరించుకునేందుకు ఫామ్ 8 వినియోగిస్తారు. ఇప్పటికే ఓటర్ల జాబితాలో ఉన్న వ్యక్తి పేరు ముసాయిదా జాబితాలో కనిపించకపోతే, తన పేరు గతంలో ఎప్పుడూ జాబితాలో లేదని ప్రకటిస్తూ ఫామ్ 6 సమర్పించాలని కోరడం ఇబ్బందికరమని పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. ఓటర్లు తాత్కాలికంగా ఢిల్లీకి దూరంగా ఉండటం, చిరునామా మారడం లేదా గణన ఫారం అందకపోవడం వంటి కారణాలతో ‘సర్’ ప్రక్రియలో పాల్గొనకపోయి ఉండవచ్చని కోర్టు పేర్కొంది. అలాంటి వారికి తిరిగి గణన ఫారం సమర్పించే అవకాశం కల్పించాలని, చిరునామా మారినవారు ఫామ్ 8 ద్వారా వివరాలు సవరించుకునేలా చూడాలని సూచించింది.
గడువు విధించొద్దు
ఢిల్లీలో ప్రస్తుతం సమీప భవిష్యత్తులో ఎన్నికలు లేనందున, ఓటర్ల పేర్ల పునరుద్ధరణకు అక్టోబర్ 30తో గడువు ముగుస్తుందని చెప్పడం ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది. పేర్లను తిరిగి చేర్చుకునే ప్రక్రియకు కటాఫ్ తేదీ విధించవద్దని సూచించింది. ఓటర్లే అధికారులను సంప్రదించే వరకు వేచి ఉండకుండా, వారి వివరాలను సేకరించి వారిని చేరుకునేందుకు ఎన్నికల సంఘం చొరవచూపాలని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ఫామ్6, ఫామ్ 8లను స్వీకరించే ప్రక్రియను కొనసాగించాలని సూచించారు. అవసరమైతే దరఖాస్తుల గడువును పొడిగించే అంశాన్ని పరిశీలిస్తామని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఫామ్ 6, 7, 8లను మార్చలేరు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ
Musi Project | మూసీ ముసుగులో లూటీ.. గుట్టుగా ప్రజాభిప్రాయ సేకరణ .. ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం
T20I | విజయంతో ముగించారు.. జింబాబ్వేతో వన్డే సిరీస్‌నూ క్లీన్‌స్వీప్ చేసిన భారత్
CPI | తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించండి.. సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని
KTR | కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేయొద్దు.. బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్‌కు కోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

