విజయంతో ముగించారు.. జింబాబ్వేతో వన్డే సిరీస్‌నూ క్లీన్‌స్వీప్ చేసిన భారత్
స్వదేశంలో భారత మహిళల జట్టు మరో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. జింబాబ్వేతో టీ20 సిరీస్‌ను 3-0తో గెలుచుకున్న స్మృతి మంధాన సేన అన్నే మ్యాచ్‌లు ఆడిన వన్డే సిరీస్‌లోనూ జింబాబ్వేను వైట్‌వాష్ చేసింది.
- ఐదు వికెట్లతో మెరిసిన వైష్ణవి
వడోదర : స్వదేశంలో భారత మహిళల జట్టు మరో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. జింబాబ్వేతో టీ20 సిరీస్‌ను 3-0తో గెలుచుకున్న స్మృతి మంధాన సేన అన్నే మ్యాచ్‌లు ఆడిన వన్డే సిరీస్‌లోనూ జింబాబ్వేను వైట్‌వాష్ చేసింది. బుధవారం వడోదరలో పూర్తి ఏకపక్షంగా జరిగిన ఆఖరి వన్డేలో యువ స్పిన్నర్ వైష్ణవి శర్మ (5/39) ఐదు వికెట్లతో జింబాబ్వే వెన్నువిరిచిన వేళ ఆ జట్టు 39.5 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. లక్ష్యాన్ని టీమిండియా 17 ఓవర్లలో రెండు వికెట్లే కోల్పోయి దంచేసింది. ప్రతీక రావల్ (56 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్) నిలకడకు తోడు షఫాలీ వర్మ (26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51 నాటౌట్) మెరుపులు మెరిపించింది. వైష్ణవికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ప్రతీకకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ లభించాయి.
వైష్ణవి దెబ్బకు కుదేలు
గత మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో చెలరేగిన వైష్ణవి.. ఈ మ్యాచ్‌లోనూ తన స్పిన్ మాయతో మ్యాజిక్ చేసి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బకొట్టింది. పేసర్ సయాలి తొలి ఓవర్లోనే ఓపెనర్ లారిన్ ఫిరిని డకౌట్ చేసి వికెట్ల ఖాతా తెరువగా మూడో ఓవర్లో క్రాంతి.. ముగెరి-టిరిపానొ (4)ను వెనక్కిపంపింది. పేసర్లు ఇచ్చిన ఆరంభాన్ని సద్వినియోగం చేసుకుంటూ వైష్ణవి సత్తాచాటింది. పదో ఓవర్లో బంతినందుకున్న ఆమె.. ఫస్ట్ బాల్కే బిజా (1)ను ఔట్ చేసింది. క్రీజులో కుదురుకున్న జింబాబ్వే టాప్‌స్కోరర్ ముపచిక్వా (37)ను బోల్తా కొట్టించిన వైష్ణవి.. 28వ ఓవర్లో ధురురు (20)నూ ఔట్ చేయడంతో జింబాబ్వే ఐదో వికెట్ కోల్పోయింది. తాను వేసిన పదో ఓవర్లో ఆఖరి బంతికి గ్వాంజురా (10)ను క్లీన్‌బౌల్డ్ చేసి కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల ఘనతను సాధించింది. క్రాంతి, సయాలీకి తలా రెండు వికెట్లు దక్కాయి.
ప్రతీక, షఫాలీ మెరుపులు
స్వల్ప ఛేదనలో తొలి బంతికే యస్తికా భాటియా వికెట్‌ను కోల్పోయినా.. ప్రతీక, హర్లీన్ (19) నిలకడగా ఆడారు. ఈ జోడీ రెండో వికెట్‌కు 59 రన్స్ జతచేసింది. రెండు బౌండరీలతో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ప్రతీక.. సిబాండా వేసిన ఐదో ఓవర్లో లాంగాన్, మిడ్ వికెట్ మీదుగా రెండు సిక్స్‌లు కొట్టింది. ప్రతీక దూకుడు కొనసాగించినా లొరిన్ విసిరిన 9వ ఓవర్లో హర్లీన్.. ముపచిక్వాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. కానీ ఆమె స్థానంలో వచ్చిన షఫాలీ.. ఆది నుంచే దంచుడు మంత్రాన్ని జపిస్తూ లొరిన్, ఫ్రాన్సిస్కా ఓవర్లలో బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదింది. ఒలిండర్ ఓవర్లో సింగిల్‌తో ప్రతీక అర్ధ శతకం పూర్తవగా ఆమెనే వేసిన 17వ ఓవర్లో ఆఖరి బంతికి సిక్స్‌గా మలిచిన షఫాలీ.. హాఫ్ సెంచరీతో పాటు భారత విజయాన్ని పూర్తిచేసింది.
సంక్షిప్త స్కోర్లు
జింబాబ్వే: 39.5 ఓవర్లకు 131 ఆలౌట్ (ముపచిక్వా 37, జొసెఫిన్ 35, వైష్ణవి 5/39, సయాలి 2/11);
భారత్: 17 ఓవర్లకు 133/2 (ప్రతీక 59*, షఫాలీ 51*, సిబాండా 1/18)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

