పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సంచలనాల పర్వం కొనసాగుతూనే ఉన్నది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్ పోరులో మూడో సీడ్ స్వియాటెక్ (పోలాండ్) 5-7, 1-6తో మార్తా కొత్సుక్(ఉక్రెయిన్) చేతిలో ఘోరంగా ఓటమిపాలైంది. ఈ సీజన్లో మట్టికోర్టుపై ఓటమి ఎరుగని స్వియాటెక్ అనామక ఉక్రెయిన్ ప్లేయర్ ముందు తలొగ్గింది. మరో సింగిల్స్‌లో స్వితోలిన 4-6, 6-4, 6-0తో బెనికిచ్పై విజయం సాధించగా, సిర్స్టీ 6-3, 7-6(7-4) వాంగ్‌పై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్ 7-6(7-3), 6-4, 6-1తో డీ జాంగ్‌పై గెలిచి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. ఐదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన మరో పోరులో జోడర్ 4-6, 4-6, 6-1, 6-2, 6-2తో కరెనోపై గెలిచాడు.