
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : సూపర్ స్పెషాలిటీ పీజీ కోర్సులు చేస్తున్న డాక్టర్ల స్టైఫెండ్ను ప్రభుత్వం పెంచింది. ఒక్కో ఏడాది 43 నుంచి 50 శాతం పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెడికోలు కొన్నాళ్లుగా విజ్ఞప్తి చేస్తుండటంతో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం స్టైఫెండ్ ను పెంచింది. ఈ మేరకు కోర్సు చేస్తున్న డాక్టర్లు హర్షం వ్యక్తం చేశారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు ధన్యావాదాలు తెలిపారు.