IPL 2023 : ఐపీఎల్ పదహారో సీజన్ సందడి మరో మూడు రోజుల్లో మొదలు కానుంది. 2016లో టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sun Risers Hydearbad)జట్టు ఈసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. యంగ్ టాలెంట్, సీనియర్లతో పటిష్టంగా కనిపిస్తోంది. ఈ జట్టు బలాలు, బలహీనతల గురించి స్పోర్ట్స్ అనలిస్ట్, కామెంటేటర్ సుధీర్ మహవాడీ (Sudheer Mahavadi) ఇలా చెప్పుకొచ్చాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో ఎలా ఆడనుంది? అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. ఈసారి ఎస్ఆర్హెచ్ మునపటి కంటే పటిష్టంగా కనిపిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 2013 నుంచి కొత్త టీమ్‌గా మారింది. అంతకుముందు దక్కన్ చార్జర్స్ పేరు ఉండేది. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ను కొత్త కెప్టెన్ నడిపించనున్నాడు.
మర్క్రం కెప్టెన్‌గా : మర్క్రం (Markram) 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ సారథిగా ఎంపికయ్యాడు. ఇతని కెప్టెన్సీలోనే సన్‌రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ జట్టు దక్షిణాఫ్రికా లీగ్‌లో చాంపియన్‌గా అవతరించింది. అంతేకాదు అండర్ -19 కెప్టెన్‌గా జట్టును విజేతగా నిలిపాడు.
హైదరాబాద్ టీమ్ బలాలు, బలహీనతలపై సుధీర్ మహవాడీ విశ్లేషణ
హెడ్ కోచ్‌గా లారా : గత సీజన్లో అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా(Brian Lara)ను ఈసారి హెడ్ కోచ్‌గా నియమించారు. అనుభవజ్ఞుడైన అతని సలహాలు, సూచనలు ఆటగాళ్లకు ఎంతో పనికొస్తాయి.
యంగ్‌స్టర్స్‌తో జోష్ : ఈ సీజన్లో న్యూజిలాండ్ ప్లేయర్, మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్‌లను వదులుకుంది. అయితే.. వీళ్లు లేకపోవడం వల్ల జట్టుపై అంత ప్రభావం ఉండకపోవచ్చు. ఎందుకంటే..? మినీ వేలంలో యంగ్ సెన్సేషన్ క్రికెటర్లను కొనుగోలు చేసంది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ హ్యారీ బ్రూక్(Harry Brook)ను రూ.13.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ యంగ్‌స్టర్ ఆన్‌సైడ్, ఆఫ్‌సైడ్ కళాత్మక షాట్లు ఆడతాడు. అందుకని ఇతడిని మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌తో పోలుస్తున్నారు. మిడిలార్డర్లో దంచి కొట్టేందుకు మయాంక్ అగర్వాల్(Mayank Agarwal), రాహుల్ త్రిపాఠి, క్లాసెన్, గ్లెన్ ఫిలిప్స్ ఉండనే ఉన్నారు.
బౌలింగ్ విభాగం పటిష్టంగా : ఎస్ ఆర్ హెచ్ బౌలింగ్ విభాగం అన్ని జట్ల కంటే బలంగా కనిపిస్తోంది. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్(Bhuvaneshwar Kumar) బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించనున్నాడు. అతడికి నటరాజన్, స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్, యంగ్‌స్టర్ కార్తిక్ త్యాగి, యాసిన్, ఫజల్హక్ ఫరూకీ సహకారం అందిస్తే ప్రత్యర్థి బ్యాటర్లకు కష్టకాలమే. స్పిన్నర్ ఆదిల్ రషీద్ కూడా బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు.
కోచింగ్ స్టాఫ్ : హైదరాబాద్ కోచింగ్ స్టాఫ్ బ్రహ్మాండంగా ఉంది. లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ స్పిన్నర్లను గైడ్ చేయనున్నాడు. మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీ అసిస్టెంట్ బ్యాటింగ్ కోచ్‌గా, డేల్ స్టెయిన్ బౌలింగ్ కోచ్‌గా సేవలందించనున్నారు. పైగా ఈసారి సొంత గ్రౌండ్లో ఏడు మ్యాచ్‌లు ఆడనుండడం కలిసి రానుంది.
ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ : ఐడెన్ మర్క్రం (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, హెన్రిచ్ క్లాసెన్, గ్లెన్ ఫిలిప్స్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, కార్తిక్ త్యాగి, ఆదిల్ రషీద్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ మార్కండే, వివ్రంత్ శర్మ, సమర్థ్ వ్యాస్, సన్వీర్ సింగ్, ఉపేంద్ర సింగ్ యాదవ్, మయాంక్ దగర్, నితీష్ కుమార్ రెడ్డి, అకీల్ హొసెయిన్, అన్మోల్ ప్రీత్ సింగ్.