IPL 2023 | భారత్ చేరుకున్న ఇంగ్లండ్ స్టార్.. వీడియో షేర్ చేసిన రాజస్థాన్ రాయల్స్
IPL 2023 : పదహారో సీజన్ ఐపీఎల్ కోసం ఇంగ్లండ్ వన్డే జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ (Jos Buttler) భారత్ చేరుకున్నాడు. అతడు ఇండియాకు వచ్చిన వీడియోను రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) ఫ్రాంఛైజీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. 15వ సీజన్లో బట్లర్ 17 మ్యాచుల్లో 863పరుగులు చేసి ఆ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.
IPL 2023 : పదహారో సీజన్ ఐపీఎల్ కోసం ఇంగ్లండ్ వన్డే జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ (Jos Buttler) భారత్ చేరుకున్నాడు. అతడు ఇండియాకు వచ్చిన వీడియోను రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) ఫ్రాంఛైజీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో బట్లర్.. ‘యుజీ (యజువేంద్ర చాహల్) ఎక్కడ?’ అని అంటాడు. 15వ సీజన్లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన బట్లర్ విధ్వంసక ఇన్నింగ్స్‌లతో రాజస్థాన్‌ను ఎన్నోమ్యాచుల్లో గెలిపించాడు. 17 మ్యాచుల్లో 863పరుగులు చేసి ఆ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.
ఆకాశమే హద్దుగా చెలగేగిన అతను నాలుగు సెంచరీలు, నాలుగు అర్ధ శతకాలు బాదాడు. 149.05 స్ట్రయిక్ రేటుతో ఆడిన ఈ హిట్టర్ శాంసన్ సేన ఫైనల్ చేరడంలో బట్లర్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో గుజరాత్ టైటన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో, రాజస్థాన్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
హైదరాబాద్‌తో తొలి మ్యాచ్
16వ సీజన్ ఐపీఎల్ మార్చి 31న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్ (Gujrat Titans,), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings, ) తలపడనున్నాయి. రాజస్థాన్ జట్టు ఏప్రిల్ 2న ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌ను ఢీ కొట్టనుంది. గత సీజన్లో ఆరెంజె క్యాప్ అందుకున్న బట్లర్ ఈసారి కూడా రాజస్థాన్‌కు కీలకం కానున్నాడు. ఇరానీ కప్‌లో సెంచరీ, డబుల్ సెంచరీ బాదిన ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ఈ సీజన్లో రాణించాలని ఆరాటపడుతున్నాడు. కెప్టెన్ సంజూ శాంసన్, ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియా కూడా చెలరేగితే ఇక రాజస్థాన్‌కు ఎదురుండదు.
ఇవి కూడా చదవండి
Narendra Shah | మహిళా క్రికెటర్ స్నేహ్ రానా కోచ్‌పై పోక్సో కేసు
ODI WC 2023 | కివీస్‌తో రెండో వన్డే రద్దు.. శ్రీలంక వరల్డ్ కప్ ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

