అచ్చంపేట రూరల్ : వేసవిలో నిర్వహిస్తున్న నృత్య, సంగీత శిక్షణ శిబిరాలను ( Summer camps ) సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ లెక్చరర్ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్ యం.రామకృష్ణ ( Ramakrishna) సూచించారు. స్వర్ణభారతి కళానిలయం ఆధ్వర్యంలో స్థానిక న్యూ ఎక్సీడ్ స్కూల్లో వేసవి నృత్య, సంగీత శిక్షణాశిబిరాన్ని గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవులను విద్యార్థులు వృధా చేయకుండా శారీరక దృఢత్వం, సృజనాత్మకత, మానసిక ఉల్లాసాన్ని కలిగించే శిబిరంలో చేరాలని కోరారు. నెలరోజుల పాటు జరిగే ఈ శిబిరంలో కూచిపూడి, జానపద నృత్యాలతో పాటు లలిత, జానపద, సంగీతం , సంగీత వాయిద్యాల్లో శిక్షణ ఉంటుందని వివరించారు.
ముగింపు ఉత్సవాలలో చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారని,ఆసక్తి కలిగిన విద్యార్థులు శిబిరంలో చేరాలని సంస్థ డైరెక్టర్, డాన్స్ మాస్టర్ నారోజు మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రంగస్థల కళాకారులు టి. రఘుపతి , అంజి మాస్టర్,రాజు మాస్టర్ , చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.