నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
భూ సమస్య చెప్పబోతే ఎకసెక్కాలు.. సమస్య చెప్తే నవ్వుతవా? అని అడిగిన రైతు.. ‘బరాబర్ నవ్వుతా’నని అధికారి వెటకారం.. రైతును అవమానించడం సిగ్గుచేటు:కేటీఆర్.. గజ్వేల్ తహసీల్దార్‌పై విమర్శలు.. రైతును అవమానించడం సిగ్గుచేటు
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ)/గజ్వేల్ : రైతు భూ సమస్యను పరిష్కారించాల్సిన అధికారే రైతుపై వెటకారంగా మాట్లాడితే సమస్యను ఎవరికి చెప్పుకోవాలి? కార్యాలయ సిబ్బంది ఎదుటే ఓ రైతును పట్టుకుని ‘నువ్వు పురుగుల మందుతాగి సావలేదా? బతికే ఉన్నవా?’ అంటూ గజ్వేల్ తహసీల్దార్ స్వామి నవ్వుతూ మాట్లాడిన వీడియో తీవ్ర కలకలం రేపింది. ‘నా పరిస్థితిని చూసి నవ్వుతారా? అని రైతు అడిగితే ‘అవును వస్తది…బరాబర్ నవ్వు వస్తది’ అంటూ సదరు తహసీల్దార్ అందరి ముందూ వెటకారంగా మాట్లాడిన వీడియో శనివారం సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని మక్తమాసాన్‌పల్లికి చెందిన రైతు శాతం ఏసు (రాజు) తమ భూ సమస్య పరిష్కారించాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. కొద్ది రోజుల క్రితం మరోసారి తహసీల్దార్ స్వామిని కలిసి సమస్య చెప్పుకునేలోపే ‘పురుగుల మందుతాగి సావలేదా? నువ్వు బతికే ఉన్నావా’ అంటూ మాట్లాడటంతో తీవ్ర మనోవేదనతో రైతు బయటకొచ్చాడు. ఇదే వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుండటంతో తహసీల్దార్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుకు న్యాయం చేయాల్సిన అధికారే వెటకారంగా మాట్లాడటం ఏమిటని అన్నివర్గాలవారు మండిపడుతున్నారు. తహసీల్దార్ వద్దకు సమస్యలు చెప్పుకునేందుకు ఎవరు వెళ్లినా ఆయన ఇలానే వ్యవహరిస్తున్నారని స్థానికులు చెప్తున్నారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు
తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్‌పై పలువురు బాధితులు కలెక్టర్‌కు ఈనెల 7న రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అధికారుల అహంకార ధోరణి, ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరి, సరైన సమాధానం ఇవ్వకపోవడం, రెవెన్యూ కార్యాలయ పనుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై విచారణ జరిపించాలని ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ వ్యవహరశైలిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నదని, కార్యాలయానికి వచ్చే వారికి సరైన సమాధానం చెప్పకపోగా సమస్యలను పరిష్కరించడంలో ఆయన వ్యవహరిస్తున్న తీరుతో నిత్యం ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కిందిస్థాయి సిబ్బంది కూడా తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పూర్తిస్థాయి విచారణ జరిపి సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రైతుపట్ల ఇంత అమానవీయమా?: కేటీఆర్ ఫైర్
‘దేశానికి అన్నం పెట్టే అన్నదాతలపై ఇంత అమానవీయంగా వ్యవహరిస్తారా?’ అంటూ బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తన వ్యవసాయ భూమిని, జీవనాధారాన్ని కాపాడుకోవాలని ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లిన రైతును అధికారి అవమానించడం సిగ్గుచేటని, అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మండిపడ్డారు. రైతు సమస్యలను పరిషరించాల్సిన అధికారి.. ఆయన బాధను ఎగతాళి చేయడం దారుణమని పేర్కొన్నారు. తన భూమిని కాపాడుకోవడానికి సాయం కోరిన రైతును ‘ఇంకా పురుగుల మందు తాగలేదా? ఇంకా బతికే ఉన్నవా?’ అంటూ అధికారి ప్రశ్నించినట్టు వెలుగులోకి వచ్చిన వీడియోపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తోటి మనిషి పట్ల ఇంత అమానవీయంగా వ్యవహరించాలంటే ఎంతటి నిర్దయతో ఉండాలని ప్రశ్నించారు.
‘మనకు అన్నం పెట్టే రైతులను ఇలాగేనా మనం చూసుకునేది? తోటి మనిషితో ఈ అధికారి వ్యవహరించిన తీరు చూస్తే, ఆయన మానసికంగా ఎంతటి అమానవీయ స్థితిలో ఉన్నారో అర్థమవుతున్నది. ఇది సిగ్గుచేటు.. ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తక్షణమే స్పందించాలని, రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిషరించాల్సిన అధికారులు వారిని కించపరిచేలా, అవమానించేలా వ్యవహరించడం సహించరాని విషయమని స్పష్టంచేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- farmer
- KTR
- land issue
- Tahsildar
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

