పెద్ద పండగకూ సెలవులు లేకపాయె!
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డుది ఒకదారి అయితే, గురుకుల సొసైటీలది మరో దారిలా ఉన్నది. బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తూ తరగతులు నిర్వహిస్తుండటమే ఇందుకు నిదర్శనం. సొసైటీల తీరుతో ఇటు విద్యార్థులు, తల్లిదండ్రులతోపాటు అధ్యాపకులు సైతం పండగ సెలవులకు దూరమవుతున్న పరిస్థితి. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను ఇంటర్మీడియట్ బోర్డు గతంలోనే ప్రకటించింది.
- బీసీ సొసైటీ సీవోఈలకు కేవలం రెండ్రోజులే సెలవులు
- బీసీ, మైనారిటీ గురుకులాల తీరుపై విద్యార్థుల ఆగ్రహం
హైదరాబాద్, అక్టోబర్10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డుది ఒకదారి అయితే, గురుకుల సొసైటీలది మరో దారిలా ఉన్నది. బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తూ తరగతులు నిర్వహిస్తుండటమే ఇందుకు నిదర్శనం. సొసైటీల తీరుతో ఇటు విద్యార్థులు, తల్లిదండ్రులతోపాటు అధ్యాపకులు సైతం పండగ సెలవులకు దూరమవుతున్న పరిస్థితి. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను ఇంటర్మీడియట్ బోర్డు గతంలోనే ప్రకటించింది. దాని ప్రకారం దసరా సెలవులను ఈ నెల 10 నుంచి 21 వరకు ప్రకటించారు. 22న తిరిగి కాలేజీలను తెరువాలని ఆదేశాలిచ్చింది. ఇప్పటికే ఇంటర్ కాలేజీలు విద్యార్థులకు సెలవులు ప్రకటించాయి.
ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకులాల సొసైటీలు సైతం ఇంటర్‌బోర్డు ఆదేశాల మేరకు సెలవులు ఇచ్చాయి. కానీ బీసీ, మైనారిటీ గురుకుల సొసైటీలు మాత్రం వాటి పరిధిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీవోఈ)లను యథావిధిగా నిర్వహిస్తుండడం గమనార్హం. మైనారిటీ గురుకుల సొసైటీలో 18 సీవోఈలు ఉండగా, వాటికి ఈ నెల 17 నుంచి 21 వరకు కేవలం 5 రోజులు మాత్రమే సెలవులు ప్రకటించింది. ఇక బీసీ గురుకుల సొసైటీ మరీ దారుణం. బీసీ సొసైటీలో 24 సీవోఈలు ఉండగా, వాటికి కేవలం రెండు రోజులు మాత్రమే(20, 21తేదీల్లో) సెలవులు ప్రకటించింది. దీంతో ఇంటర్‌బోర్డు ఆదేశాలను సొసైటీలు తుంగలో తొక్కడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో బతుకమ్మ, దసరా పెద్ద పండగలు కావడంతో కేవలం రెండు రోజులే సెలవులు ప్రకటించడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయా సీవోఈల్లోని బోధనా సిబ్బంది సైతం ఉన్నతాధికారుల తీరుపై అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఇంటర్‌బోర్డు నిర్ణయించిన మేరకు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

