గట్టుప్పల్, సెప్టెంబర్ 29 : గట్టుప్పల్ మండల పరిధిలోని నామాపురం గ్రామంలో ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి మంగళవారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి రూ.2.55 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సబ్ స్టేషన్ నిర్మాణంతో నామాపురం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో లో-వోల్టేజీ సమస్య తీరి, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందుతుందని అధికారులు తెలిపారు. అనంతరం ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరమల్ల శ్రీశైలం గౌడ్, ఆయా శాఖల అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

నామాపురంలో సబ్ స్టేషన్ అభివృద్ధి పనులకు శ్రీకారం