హైదరాబాద్ : స్టేషన్ బెయిల్ మంజూరి కోసం రూ. 30 వేలు తీసుకున్న ఎస్సైని ఏసీబీ ( ACB Raid ) అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్సై దువ్వాల ఆంజనేయులు ( SI Anjaneyulu) గురువారం తన ఇంటిలో బాధితుడు నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. తన కుమారుడికి స్టేషన్ బెయిల్( Staion Bail ) మంజూరు చేసి చార్జిషీట్లో తక్కువ శిక్షపడే సెక్షన్లు విధించాలని కోరుతూ బాధితుడు ఎస్సైను సంప్రదించాడు.
దీంతో ఎస్సై లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వారి వ్యూహం ప్రకారం ఎస్సై లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఎస్సైపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచామని ఏసీబీ అధికారులు వివరించారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు గాని ,9440446106 అనే వాట్సప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.