KTR | పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసేలా కాంగ్రెస్ సర్కార్ జీవో 97 తీసుకురాగా.. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. జీవో 97కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్వీ మద్దతుగా నిలిచి ఆందోళనల్లో పాల్గొంటుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విద్యార్థులకు, వారితో బీఆర్ఎస్వీ కలిసి చేస్తున్నపోరాటానికి పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్టు ట్వీట్ చేశారు.
విద్యార్థుల ఆందోళనకు సంబంధించిన వీడియోను ట్యాగ్ చేస్తూ.. రేవంత్ ప్రభుత్వం తీసుకున్న ఈ తప్పుడు నిర్ణయం వల్ల వేలాదిమంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారిందన్నారు. శాంతియుతంగా నిరసనను తెలుపుతున్న విద్యార్థుల మీద కొన్ని చోట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన దృశ్యాలు నన్ను కలచివేశాయి. విద్యార్థుల హక్కులను కాలరాయొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జీవో 97ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికే పలు నిరసన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, బీఆర్ఎస్ నాయకులు పాల్గొని విద్యార్థులకు మద్దతు తెలిపారు. ఇక ముందు కూడా పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటానికి అన్ని విధాలుగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
జీవో 97 కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాను.
రేవంత్ ప్రభుత్వం తీసుకున్న ఈ తప్పుడు నిర్ణయం వల్ల వేలాదిమంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది.
శాంతియుతంగా నిరసనను తెలుపుతున్న… pic.twitter.com/5n8m396NFR
— KTR (@KTRBRS) August 20, 2026