POCSO Court: నలుగురు బాలికలపై అత్యాచారం.. తమిళనాడు పాస్టర్కు మరణశిక్ష
POCSO court: నలుగురు బాలికలపై అత్యాచారం చేసిన కేసులో 47 ఏళ్ల అబ్రహంకు తిరునల్వెల్లి పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది. 2022 సంవత్సరంలో స్థానిక చర్చిలో పాస్టర్‌గా విధులు నిర్విస్తున్న సమయంలో బాలికలను బంధించి నిందితుడు అఘాయిత్యానికి పాల్పడినట్లు కోర్టులో రుజువైంది. నిందితుడికి నాలుగు మరణశిక్షలను ఖరారు చేసింది కోర్టు.
తిరునల్వెల్లి: తమిళనాడులోని నలుగురు బాలికలను లైంగికంగా వేధించిన కేసులో ఓ నిందితుడికి తిరునల్వెల్లి పోక్సో కోర్టు(POCSO Court) మరణశిక్ష విధించింది. నిందితుడిని 47 ఏళ్ల అబ్రహంగా గుర్తించారు. జడ్జి సురేశ్ కుమార్ ఈ కేసులో తీర్పు ఇచ్చారు. నిందితుడికి నాలుగు మరణశిక్షలు వేశారు. 52వేల జరిమానా విధించారు. బాధిత అమ్మాయిలకు ఒక్కొక్కరికి 10 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 2022 జూలై 5వ తేదీన తిరునల్వెల్లిలోని మహిళా పోలీసు స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదు అయ్యింది. ఓ బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసును రిజిస్టర్ చేశారు. అబ్రహంను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. ఛార్జీషీట్లో సాక్ష్యాలను నిరూపించినట్లు జడ్జీ సురేశ్ కుమార్ తేల్చారు.
తిరునల్వెల్లి జిల్లాలోని గంగైకొండ సమీపంలో ఉన్న మేలైలంతైకులం చర్చిలో అమ్మాయిలను బంధించి, వారిపై అత్యాచారానికి పాల్పడినట్ల పాస్టర్ అబ్రహంపై ఆరోపణలు ఉన్నాయి. చర్చికి వెళ్లిన అమ్మాయిలను అక్రమంగా ప్లాస్టర్ బంధించాడని, ఆ తర్వాత లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. ఒకవేళ విషయాన్ని బయట చెబితే చంపేస్తానని బెదిరించినట్లు ప్రాసిక్యూషన్ తన వాదనల్లో పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
‘పంచాయతీల సమస్యలను పరిష్కరించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

