Sugar Prices : దేశంలో చక్కెర ధరలు పెరిగిపోతున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో ధరలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ధరల పెరుగుదలను అరికట్టాలంటే దిగుమతులు ఒక్కటే మార్గమని నమ్ముతోంది. ఇందుకోసం ఒక మిలియన్ టన్నుల ముడి చక్కెర దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. అది కూడా ఎలాంటి సుంకాలు లేకుండా.
దేశంలో చక్కెర సరఫరా పడిపోవడం, దిగుమతుల మీద ఈ స్థాయిలో ఆధారపడటం పదేళ్లలో ఇదే మొదటిసారి. ప్రస్తుతం దేశంలో చక్కెర ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత మార్చి నుంచి నెమ్మదిగా పెరుగుతూ వస్తున్నాయి. చక్కెర పరిశ్రమలు ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలోని మిల్లుల్లోనే క్వింటాల్ చక్కెర ధర రూ.5,400-రూ.5,560 పలుకుతోంది. ప్రస్తుతం దేశంలో ఫెస్టివల్ సీజన్ ప్రారంభం కానుంది. దీంతో చక్కెరకు డిమాండ్ ఇంకా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
మార్కెట్ వర్గాల ప్రకారం దేశంలో షుగర్ సీజన్ ప్రతి ఏడాది అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. 2025-2026 సీజన్లో అంచనాలకు మించి దేశంలో చక్కెర వినియోగం పెరిగిపోయింది. ఉత్పత్తి అంచనాల్లో జరిగిన పొరపాట్ల వల్ల కేంద్రం గతంలో 1.5-2.0 మిలియన్ టన్నుల చక్కెర దిగుమతికి కేంద్రం అనుమతించింది. గత ఏడాది నవంబర్‌లో చక్కెర ఎగుమతులు చేసేందుకు అనుమతించింది. ఆ తర్వాత కేంద్రం పరిస్థితిని గమనించి చక్కెర ఎగుమతులపై నిషేధం విధించింది. అయితే, ఆలోపే 0.8 మిలియన్ టన్నుల చక్కెర ఎగుమతి అయింది.
అంటే, ఇప్పుడు ఇండియా దిగుమతి చేసుకోవాలనుకుంటున్న ముడి చమురుకు ఇది కాస్త తక్కువ. మనం ఎంత ఎగుమతి చేశామో.. అంతే దిగుమతి చేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇది చక్కెర తయారీ, మార్కెటింగ్‌కు సంబంధించిన కొందరు వ్యక్తులు చేసిన పొరపాటు వల్లే అని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇండియా చివరగా 2016-17 సీజన్లో చివరగా ముడి చక్కెర దిగుమతికి అనుమతించింది. ఇప్పుడు మళ్లీ దాదాపు పదేళ్ల తర్వాత ఈ స్థాయిలో దిగుమతులకు సిద్ధమవుతోంది.