మహేశ్వరం: శానిటేషన్ పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల కేంద్రంలోని బాలికల పాఠశాలను జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డితో కల్సి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి పరిశుభ్రంగా ఉండి తరుచుగా చేతులను కడుక్కొని, భౌతికదూరాన్ని పాటించాలని అన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో పాఠశాలలను కోర్టు నిబంధనలు పాటిస్తూ ఈరోజు నుండి ప్రారంభించామని ఆమె తెలిపారు. హాస్టళ్లు మినహాయించి అన్ని పాఠశాలలను కోర్టు ఆదేశాలతో నడుపడానికి సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని ఆమె అన్నారు. పంచాయతిరాజ్, మున్సిపల్ అధికారుల సమన్వయంతో పాఠశాలలో ప్రత్యేక శ్రద్దతో పరిశుభ్రత కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని ఆమె అన్నారు. ప్రతి ఇంట్లో ఎలాగైతే కొవిడ్ నిబంధనలను పాటిస్తున్నారో అదే విదంగా పాఠశాలలో కూడ నిబంధనలను పాటిస్తూ ఉండాలని ఆమె విద్యార్థులు వారి తల్లిడండ్రులకు సూచించారు.
అధికారులు,ఉపాద్యాయులు విద్యార్థుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థులకు ఎటువంటి జలుబు, దగ్గు లక్షణాలు ఉన్న సంబంధిత డాక్టర్లను సంప్రదించాలని ఆమె అన్నారు. మద్యాహ్నం భోజన సమయంలో విద్యార్థుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.ఈకార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్‌ఎంపీపీ సునితా ఆంధ్యానాయక్, జిల్లా విద్యాధికారి సుశీంద్రరావు, మండల విద్యాధికారి కృష్ణయ్య మండల పార్టీ నాయకులు హనుమగల్లచంద్రయ్య,జిల్లా రైతు సమన్వయ సమితినాయకులు కూనయాదయ్య,సహకారబ్యాంక్ వైస్‌చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.