రామగిరి, మార్చి 08 : నల్లగొండ పట్టణంలోని ఎంవీఆర్ విద్యా సంస్థలు తమ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులచే వారి తల్లిదండ్రులకు పాదపూజ మహోత్సవం నిర్వహించాయి. స్థానిక చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి నల్లగొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేటి సమాజంలో మారుతున్న విద్యార్థుల ధోరణి సక్రమ మార్గంలో పెట్టి తల్లిదండ్రులపైన గౌరవం, కుటుంబ బాంధవ్యాలను పెంచే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని ఎంవీఆర్ విద్యా సంస్థల చైర్మన్ కొలనుపాక రవికుమార్ తెలిపారు. దాదాపు 800 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ పాదపూజలో పాల్గొనడం జరిగిందని చెప్పారు. వీరందరికీ భోజన తాంబూలాలు, నూతన వస్త్రాలు ఇచ్చి సత్కరించినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ గీత రవికుమార్, ప్రిన్సిపాల్ మేరెడ్డి రఘునందన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

తల్లిదండ్రులకు విద్యార్థులు పాదపూజ