నకిరేకల్, మార్చి 17 : పేదల అభ్యున్నతి కోసం వివేకానంద స్వామి ఎంతగానో పరితపించారని, విద్యార్థులు కూడా శ్రద్ధతో ఉన్నత చదువులు చదివి దేశ పురోగతి కోసం పాటుపడాలని రామకృష్ణ మఠం హైదరాబాద్ అధ్యక్షుడు స్వామి బోధమయానంద జీ అన్నారు. నకిరేకల్ పట్టణంలో రామకృష్ణ మఠం వారి ఆధ్వర్యంలో ముంబైకి చెందిన రెబెకో కంపెనీ వారి ఆర్థిక సహకారంతో నకిరేకల్ జడ్పీహెచ్ఎస్లో చదువుతున్న 50 మంది విద్యార్థులకు రూ.5 లక్షల విలువ గల సైకిళ్లను మంగళవారం ఉచితంగా పంపిణీ చేశారు. శ్రీ రామకృష్ణ సేవా సమితి సూర్యాపేట వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

విద్యార్థులు ఉన్నత చదువులు చదివి దేశాభివృద్ధికి పాటుపడాలి : స్వామి బోధమయానంద జీ
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్వామీజీ మాట్లాడుతూ.. విద్యార్థులు స్వామి వివేకానందులను, అబ్దుల్ కలాం వంటి వారిని ఆదర్శంగా తీసుకుని దేశ ప్రజలకు సేవ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వేముల పుష్ప వీరేశం, నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రజిత శ్రీనివాస్, మండల విద్యాధికారి మేక నాగయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోదాటి రాములు, సేవా సమితి అధ్యక్షుడు పెండెం స్వర్ణలత చంద్రశేఖర్, కోనేటి వెంకన్న, సందినేని వెంకటేశ్వరరావు, గజ్జల రామకృష్ణ, పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

విద్యార్థులు ఉన్నత చదువులు చదివి దేశాభివృద్ధికి పాటుపడాలి : స్వామి బోధమయానంద జీ