గంగాధర, డిసెంబర్ 13 : విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు సూచించారు. జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం మండల స్థాయి గణిత ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. మండలంలోని వివిధ పాఠశాలల నుంచి 50 మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలుగు మాధ్యమంలో గంగాధర ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని వైశాలి, కేజీబీవీ విద్యార్థులు స్రవంతి, హేమలత, ఆంగ్ల మాధ్యమంలో బూరుగుపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అక్షయ్సాగర్, మోడల్ స్కూల్ విద్యార్థి శరణ్య, ఉప్పరమల్యాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థి లహరి ప్రతిభ చూపి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులను డీఈవో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మేచినేని నవీన్‌రావు, ప్రధానోపాధ్యాయుడు సట్టు పురుషోత్తం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రామడుగు, డిసెంబర్ 13: మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పదో తరగతి విద్యార్థులకు మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి గణిత ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. తెలుగు మాధ్యమంలో వెలిచాల పాఠశాల విద్యార్థి వర్షిణి ప్రథమ, రామడుగు పాఠశాల విద్యార్థి ప్రత్యూష ద్వితీయ, గోపాల్రావుపేట పాఠశాల విద్యార్థి కార్తీక్ తృతీయ స్థానంలో నిలిచినట్లు ఎంఈవో అంబటి వేణుకుమార్ తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో రామడుగు పాఠశాల విద్యార్థి అనూష ప్రథమ, వెదిర కేజీబీవీ విద్యార్థి మధుశ్రీ ద్వితీయ, మోడల్ స్కూల్ విద్యార్థి శ్రీలత తృతీయ స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు భారతి, టీఎంఎఫ్ మండలాధ్యక్షుడు గంగాధర్, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, ఆయా పాఠశాలల గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశం మేరకు తెలంగాణ గణిత ఫోరం-కరీంనగర్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో మండలంలోని చింతకుంట జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు మండల స్థాయి గణిత ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి 50 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. తెలుగు మాధ్యమం నుంచి గణేశ్ ప్రథమ, డీ ఝాన్సీ ద్వితీయ, ఎన్ త్రిష తృతీయ, ఆంగ్ల మాధ్యమం నుంచి వైద్యనాథ్ ప్రథమ, సాయినాథ్ ద్వితీయ, ఎండీ సమ్రీన్ తృతీయ స్థానంలో నిలిచారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మధుసూదన్, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, హెచ్ఎం భూంరెడ్డి, ఉపాధ్యాయులు వేణుగోపాల్‌రావు, మహేశ్వర్, శాంతిరాజు, రజిత, పద్మజ పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి గణిత ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించినట్లు మండల విద్యాధికారి మధుసూదనా చారి తెలిపారు. తెలుగు మాధ్యమంలో దుర్శేడ్ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎం వైష్ణవి ప్రథమ, ఎం తేజస్వీని ద్వితీయ, గౌతమి తృతీయ, ఆంగ్ల మాధ్యమంలో నగునూర్ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి సంజయ్ ప్రథమ, చామనపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు సాగర్ ద్వితీయ, శృతి తృతీయ స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. విజేతలకు మండల విద్యాధికారి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నగునూర్ జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, టీఎంఎఫ్ మండల బాధ్యులు పాల్గొన్నారు.