అలంపూరు : విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలని, క్రమం తప్పకుండా, క్రమశిక్షణతో కళాశాలలకు హాజరు కావాలని జోగులాంబ గద్వాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి ఎం. హృదయ రాజు (Hrudaya Raju) విద్యార్థులకు సూచించారు. గురువారం ప్రభుత్వ జూనియర్ కళాశాల అలంపూర్ను సందర్శించి, ప్రేయర్లో విద్యార్థుల తో ఇంటారాక్ట్ అయ్యారు.
ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. అకాడమిక్ ఇయర్ మొదటి నుంచే ఇంటర్ విద్యార్థులకు ఎప్సెట్ , మెయిన్స్, నీట్, సీఏ , పోటీ పరీక్షలకు ప్రత్యేక తరగతులను ఏర్పాట్లు చేయిస్తుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు.
విద్యార్థులు మొదటి నుంచే తమ లక్ష్యాన్ని ఎంచుకొని, దాని సార్థకతకు కష్టపడాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిష్ణాతులైన అధ్యాపకులు ఉన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డి రాజు, ఎన్ రాముడు, రామచంద్రయ్య, రఘువీర్ కుమార్, సుధారాణి, వెంకటరాణి, మల్లయ్య, పూర్ణిమ, అభిజ్ఞ, మౌనిక, అధ్యాపాకేతర సిబ్బంది మునిస్వామి, రాఘవేంద్ర, విద్యార్థులు పాల్గొన్నారు.